Leading News Portal in Telugu

Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి


  • మలయాళ ఇండస్ట్రీలో విషాదం

  • గుండెపోటుతో మలయాళ నటుడు కన్నుమూత
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

Malayalam Actor Nirmal Benny Died: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని కన్నుమూశారు. ఆమెన్‌లో కొచ్చాచన్‌గా నిర్మల్‌ నటించారు. ఇక తాజాగా గుండెపోటుతో 37 ఏళ్ళ నిర్మల్ మృతి చెందాడు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం చేశారు.

Miss India: ఏపీ నుంచి మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన భవ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

తన ప్రియ మిత్రుడికి శాశ్వత శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నిర్మాత కూడా రాసుకొచ్చారు. నిర్మల్ వి బెన్నీ కామెడీ షోల ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. నిర్మల్ వి బెన్నీ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఆయన 2012లో విడుదలైన వెల్‌కమ్ టు న్యూబీస్ చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆమెన్‌లో కొచ్చాచన్ పాత్ర ఆయనని నటుడిగా పాపులర్ చేసింది. నిర్మల్ వి బెన్నీ ధార అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఆయన ఆమెన్, దర్శ సహా ఐదు చిత్రాలలో నటించారు.