Leading News Portal in Telugu

VV Vinayak: డైరెక్టర్ వీవీ వినాయక్ కి సర్జరీ? అసలేమైందంటే?


VV Vinayak undergoes a major Liver Surgery: ప్రస్తుతం తను నటించే సినిమా షూటింగ్లో మాస్ మహారాజా రవితేజ గాయాల పాలవడం తెలుగు సినీ అభిమానులందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆయనకు మైనర్ సర్జరీ కూడా జరగగా ఈరోజు డిశ్చార్జ్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఒకప్పుడు మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వీవీ వినాయక్ కి ఒక మేజర్ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. చివరిగా ఆయన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశారు. సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాని గత ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ చేస్తే దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు, గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు

తాజాగా ఆయనకు ఒక మేజర్ లివర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్జరీ ముగిసిందని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎల్బీనగర్ లో ఉన్న కామినేని హాస్పిటల్స్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లుగా చెబుతున్నారు. ఇక వివి వినాయక్ రాయదుర్గంలో కొన్నేళ్ళ క్రితం ఒక భారీ భవంతిని నిర్మించుకున్నారు. మరి ఏమైందో ఏమో దాన్ని అమ్మేసి ఈ మధ్యనే కోకాపేట్ లో ఉన్న ఒక పోష్ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. ఆయన హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు కానీ అది పలు కారణాలతో ఆగిపోయింది.