Leading News Portal in Telugu

Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్


  • ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఇదే
  • అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం
Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

Mathu Vadalara 2: శ్రీ సింహ, సత్య. నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మత్తు వదలరా’ చిత్రం డిసెంబర్‌ 25, 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ ‘మత్తు వదలరా’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు, ఆ చిత్ర బృందం దాని అధికారిక సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మత్తు వదలరా 2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ఆ చిత్ర బృందం ప్రకటించింది.

ఎంతో ఎదురుచూసిన ఈ సీక్వెల్ చిత్రం సెప్టెంబర్ 13, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా తెలిపారు. శ్రీసింహ, సత్య ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఎవరో తుపాకులతో దాడి చేస్తున్నట్లుగా ఉంది. ఈ కొత్త అధ్యాయం ఎలా ముగుస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తు్న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కి మరోసారి కాల భైరవ సంగీతం అందించడంతో అంచనాలు మరింత పెరిగాయి.