Bigg Boss 8 Telugu Contestants list: ఎన్నో లీకులు మరెన్నో ప్రచారాల అనంతరం బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. ఈరోజు సాయంత్రం 7:00 నుంచి ఈ సీజన్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మేకర్లు. గతంలో కంటే భిన్నంగా ఇద్దరేసి కంటెస్టెంట్లను లోపలికి పంపుతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు వివరాలు వారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
యష్మీ గౌడ:
ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది యష్మీ గౌడ. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన నటి. తెలుగులో కూడా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయింది ఇప్పటికే జీ తెలుగులో ప్రసారమైన ప్రదీప్ సూపర్ క్వీన్స్ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు యష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనకి బాయ్ ఫ్రెండ్ లేడని ఒకప్పుడు ఉండేవాడిని చెప్పుకొచ్చింది. మూడ్ స్వింగ్స్ భరించలేడని నేనే పంపేశానని పేర్కొన్న ఆమె పెళ్లిపై మాత్రం ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చింది. ముందు రిలేషన్ తర్వాత లవ్ ఆ తర్వాతే పెళ్లి అని చెప్పుకొచ్చింది. పెద్దలు కుదిరిచిన పెళ్లి అసలు చేసుకోనని చెబుతున్న ఆమె తనకు వంట చేయడం రాదు అలాగే బిర్యానీ లేకుండా ఉండలేనని అంటోంది. ఇక తనకు ఆకలేస్తే కోపం వస్తుందని చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పినా కోపం వస్తుందని ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి తనకు ఎలాంటి స్ట్రేటజీలు లేవని పోటీ మాత్రం ఇచ్చేందుకు రెడీ అవుతానని ఆమె అంటుంది.
నిఖిల్ మలయక్కల్
ఇక హౌస్ లోకి రెండవ కంటెస్టెంట్ గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ఆయన తర్వాత తెలుగులో సీరియల్స్ లో చేస్తూ వస్తున్నాడు. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయారని ఆయన అంటున్నాడు. ఇక సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నిఖిల్ బిగ్బాస్ సీజన్ 8 లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతానికి అతను సింగిల్ అని చెబుతూనే కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్ కొచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిని వెతుక్కునే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. తనకు జీవిత భాగస్వామిని తల్లి తీసుకొస్తుందని తనకు హౌస్ లో మనశ్శాంతి కావాలి కానీ అది దొరకదని చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
అభయ్ నవీన్
ఇక తెలుగులో రామన్న యూత్ రాక్షస కావ్యం లాంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నవ్వించిన అభయ్ నవీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దిపేటకు చెందిన అభయ్ నవీన్ పెళ్లిచూపులు సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ మెంబర్ ను అని చెబుతూనే అప్పట్లో లెజెండ్రీ ఏఎన్ఆర్ తన నటనను చూసి మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు. నటుడిగా కొన్ని సినిమాలు చేసి దర్శకత్వం చేయాలనిపించి రామన్న యూత్ అనే సినిమా చేశారు ఇప్పుడు బిగ్ బాస్ అనే వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అవుతాను కానీ బయటకి కనపడని చెబుతున్నాడు అభయ్.
ప్రేరణ కంభం
ఇక నాలుగవ కంటెస్టెంట్ గా ప్రేరణ కంభం లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన నటి. అక్కడ రంగనాయకి అనే ఒక షో తో పాపులర్ అయిన ఆమె తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ లో చేస్తోంది. ఇక తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటానని నాగార్జునకు అని చెప్పుకొచ్చింది. మంచి రిలేషన్స్ ఉండాలి ఎప్పుడూ జాలీగా ఉండాలి, గేమ్స్ బాగా ఆడతా నాతో పోటీ పడే కంటెస్టెంట్ లో పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను అంటూ తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చేసుకుంది ఆమె. తాను హీరోయిన్ రష్మిక మందన క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇద్దరం కలిసి స్కూటీ మీద అర్ధరాత్రులు తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయని చెబుతోంది. తనకు పెళ్లయి 8 నెలలు అయిందని తన భర్త పేరు శ్రీపాద అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తనకు హౌస్ లో లిమిట్ లెస్ గా నిద్ర కావాలి అంటూ జరగని పని గురించి చెబుతూ ఆమె లోపలికి వెళ్లడం గమనార్హం.
ఆదిత్య ఓం:
ఇక బిగ్ బాస్ హౌస్ లోపలికి ఐదవ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఎమోషనల్ అయ్యాడు. 2005వ సంవత్సరం తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అప్పుడు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదని అన్నాడు. జీవితమంటేనే పోరాటం అని తెలిసి మళ్ళీ 2010లో కెరియర్ ప్రారంభించి నాలుగు హిందీ సినిమాలను డైరెక్ట్ చేశా. ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నానని అలా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర రెండు గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేశానని, సమాజ సేవలో ఉండే సంతృప్తి వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కెరియర్ లో మళ్ళీ పునర్ జన్మకోసమే బిగ్ బాస్ కొస్తున్నానని బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే ఒక అంతరిక్ష యానంలా ఉందని తన ఫీలింగ్ బయటపెట్టాడు. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఇష్టం అని హౌస్ లో కూడా తనకు లిమిట్లెస్ గా ఛాలెంజ్ కావాలని అభిప్రాయపడ్డాడు.
సోనియా ఆకుల:
నటి సోనియా ఆకుల బిగ్బాస్ 8లోకి ఆరవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన దిశ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాను బిగ్ బాస్ కి రావడానికి ఒక కారణం ఉందని ఎందుకంటే డబ్బున్న వాళ్ళు కోట్లు పెట్టినా ఇక్కడికి రావడం కుదరదు అని చెప్పుకొచ్చింది. తక్కువ మందికి మాత్రమే వచ్చే ఈ అవకాశం నాకు కూడా వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చేసానని చెప్పుకొచ్చింది. హౌస్ లో లిమిట్ లెస్ గా ఫ్రెండ్స్ కావాలని ఆమె చెప్పుకొచ్చింది.
బెజవాడ బేబక్క
సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అలియాస్ సింగర్ మధుగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన మధు నెక్కంటి బిగ్బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. బెజవాడలో బేబీలు, బేబామ్మలు చాలా ఎక్కువ అని అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. విజయవాడ గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తుంటానని అక్కడ ఏ కార్యక్రమం ఉన్న హోస్టుగా, సింగర్ గా ఎంటర్టైన్ చేయడానికి తనను పిలుస్తుంటారని చెప్పుకొచ్చింది. హౌస్ లో తనకు ఫుడ్ అన్లిమిటెడ్ గా కావాలి అంటూ ఆమె కామెంట్ చేసింది.
ఆర్జే శేఖర్ బాషా
ఇక ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన ఆర్జే శేఖర్ భాష కూడా ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రేడియో జాకీగా పనిచేస్తున్న ఆయనకు వచ్చిన గుర్తింపు కంటే రాజ్ తరుణ్ స్నేహితుడిని అని చెప్పుకుంటూ తెచ్చుకుని గుర్తింపు ఎక్కువ అని చెప్పవచ్చు. ఆయన కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈసారి గేమ్ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.
Updating