- విశాఖలో పవన్ కళ్యాణ్ ను పోలిన విగ్రహం
-
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు- వీడియోలు -
గతంలో జాలరిలా ఫోజిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan inspired idol for Ganesh Chaturthi goes Viral: ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ రావడం ఆనవాయితీగా మారింది. ఒక్కరని కాదు తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ ను పోలిన వినాయకుడిని ప్రతిష్టించారు.
Bigg Boss Telugu 8: సీజన్ 1 నుంచే ఆంటీల సెంటిమెంట్.. ఫస్ట్ వీక్ బయటకొచ్చేసిన వారి లిస్ట్ ఇదే!
గతంలో జాలర్ల కోసం పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఒక చేతిలో వల మరో చేతిలో జాలరి గంప పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు అదే ఫోటోను ఆధారంగా చేసుకుని ఒక విగ్రహాన్ని తయారు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరిపారు అక్కడి ఫిషింగ్ హార్బర్ వర్కర్లు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పిచ్చి అని అంటూ కామెంట్ చేస్తున్నారు. దేవుడికి ఇలాంటి వింత ఆకారాల్లో విగ్రహాలు పెట్టడం తగదని కామెంట్ చేస్తున్నారు,