Leading News Portal in Telugu

Rao Ramesh : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..


  • ఓటీటీ స్టీమింగ్ కు మారుతినగర్ సుబ్రమణ్యం
  • అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసిన ఆహా
  • థియేటర్లో సూపర్ హిట్ సాధించిన మారుతినగర్ సుబ్రమణ్యం
Rao Ramesh : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది.  అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

కంటెంట్ నచ్చడంతో సుకుమార్ సతీమణి తబిత ఈ సినిమాను సమర్పించగా తెలంగాణ, ఏపీలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేసింది. ఆగస్టు 23న రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5.0 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజైన మారుతినగర్ సుబ్రమణ్యం భారీ హిట్ గా  నిలిచింది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. తాజగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. ఈ సెప్టెంబరు 20న ఆహాలో మారుతినగర్ సుబ్రమణ్యాన్ని డిజిటల్ ప్రీమియర్ కు తీసుకువస్తున్నారు సదరు ఓటీటీ సంస్థ. ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. ఇటీవల కాలంలో ఓటీటీ లో చిన్న సినిమాలు మంచి వ్యూస్ రాబడుతున్నాయి. కథ, కథనాలు బాగుంటే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు. మరి థియేటర్లో ఆకట్టుకున్న మారుతినగర్ సుబ్రమణ్యం ఓటీటీ  ఎటువంటి వ్యూస్ రాబడుతుందో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.