Leading News Portal in Telugu

Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?


  • దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

  • హైదరాబాదులోనే నోవోటెల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్

  • సెప్టెంబర్ 22 ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్
Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?

Devara Pre Release Event Venue Details: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకోవడం లేదు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద, కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత.. అందుకే అంటూ పోస్ట్

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలి అని కొద్ది రోజులుగా తర్జనభర్జనలు పడుతున్న సినిమా యూనిట్ ఫైనల్ గా ఒక వేదిక ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 22 ఆదివారం నాడు హైదరాబాదులోనే నోవోటెల్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి భారీ అభిమానుల కోలాహలం మధ్య ఒక ఓపెన్ గ్రౌండ్లో నిర్వహించాలనుకున్నారు. కానీ వర్షం పడితే అంత అప్సెట్ అవుతుందని అనుమానపడ్డారు. అయితే క్రౌడ్ కోసం ఏదైనా ఇండోర్ వెన్యూ కోసం వెతికారు కానీ చివరికి నోవోటేల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నోవాటెల్ కాబట్టి అభిమానులకు పెద్దగా ఎంట్రీ అవకాశాలు లేవని చెప్పొచ్చు. కేవలం సినిమా టీం, మీడియా కొద్ది మంది అభిమానుల సమక్షంలో మాత్రమే ఈ ఈవెంట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.