- టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న జానీ మాస్టర్ వ్యవహారం
-
తాజా ప్రెస్ మీట్ లో అలీని ప్రశ్నించిన రిపోర్టర్ -
ఆసక్తికరంగా స్పందించిన అలీ.

ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యువ లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నాడని లైంగికంగా వేధిస్తున్నాడని కొన్నిసార్లు రేప్ కూడా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం మీద టాలీవుడ్ కూడా సీరియస్ అయింది, ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయం మీద ఫైర్ అయ్యింది. అంతేకాదు శ్రీరెడ్డి అంశం తెరమీదకు వచ్చిన తర్వాత ఏర్పాటైన లైంగిక కమిటీ కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది.
ఇక తాజాగా ఈ అంశం మీద స్పందించేందుకు నటుడు అలీ నిరాకరించారు. దిలీప్ ప్రకాష్ హీరోగా రెజీనా కసాండ్రా హీరోయిన్గా తెరకెక్కిన ఉత్సవం సినిమా సక్సెస్ మీట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాలో నారదుడి నాటక పాత్రలో కనిపించిన అలీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ ఇండస్ట్రీలో తాజాగా జరుగుతున్న ఒక వ్యవహారం మీద స్పందించాల్సిందిగా కోరగా తాను స్పందించను అంటూ ఆయన నిరాకరించారు. అయితే మీ టు గురించి అంటూ సదరు రిపోర్టర్ వివరించే ప్రయత్నం చేయగా మీ టు అంటూ ఆలీ మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం అంటూ సంజ్ఞలు చేశారు. ఇక ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.