Leading News Portal in Telugu

Jani Master: జానీ మాస్టర్‌ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్‌


Jani Master: జానీ మాస్టర్‌ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్‌

Warning to Dancers in Jani Master issue:కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేంటంటే జానీ మాస్టర్ ఇష్యూ మీద డాన్సర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరూ జానీ గురించి గానీ ఈ విషయం గురించి గానీ మాట్లాడవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్ అసోసియేషన్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఎవరూ మాట్లాడవద్దని ఫిలిం ఛాంబర్ తరపున డిసైడ్ చేశామ,ని ఇకపై ఎవరూ నోరు విప్పాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.

‘ఈ రోజు సాయంత్రం చాంబర్లోకి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో దామోదర్ ప్రసాద్ అలాగే తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరర్ పాల్గొన్నారు. ఆ మీటింగ్ లో దామోదర్ గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటంటే ఇక వేరే వేరే చోట్ల కానీ వాళ్ల పేర్లు ప్రస్తావించవద్దు. ఈ విషయాన్ని గాని ప్రస్తావిస్తే అందరూ శిక్షార్హులవుతారు. డాన్సర్స్ యూనియన్ అయినా ఫెడరేషన్ అయినా ఛాంబర్ అయినా తెలుగు సినీ పరిశ్రమ అయినా ఎవరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడవద్దు, ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ విషయాన్ని అసలు మాట్లాడవద్దు. ఎందుకంటే ఇది చట్ట పరిధిలో ఉంది. వాళ్ల పేర్లు ప్రస్తావించి ఏదో లబ్ధి పొందుదామని పేరు సంపాదిద్దామని, లేక కొంతమంది దగ్గర మార్కులు సంపాదిద్దామని అలా పేర్లు ప్రస్తావన మాత్రం చేయవద్దు. మనకు మనకు ఎలక్షన్స్ పరంగా ఎన్ని గొడవలు అయినా ఉండవచ్చు కానీ ఈ విషయాన్ని అందుకు వాడుకోవద్దు. దయచేసి చెబుతున్నాను ఇది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దయచేసి ఈ టాపిక్ మాట్లాడవద్దు’’. అంటూ ఒక ఆడియో మెసేజ్ గ్రూపులో పోస్ట్ అయినట్టు తెలుస్తోంది.