Leading News Portal in Telugu

Actor Arrested: రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్


Actor Arrested: రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్

Idavala Babu Arrested Released on Anticipatory Bail : అత్యాచారం ఆరోపణల కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబును సిట్‌ బృందం అరెస్టు చేసింది. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇడవేల బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబు అమ్మ(మలయాళ నటీనటుల సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లానని, అప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ అత్యాచారం కేసులో నటుడు ఇడవేల బాబు అరెస్ట్ అయ్యారు. విచారణ అనంతరం ఇడవేల బాబును అరెస్టు చేశారు.

Koratala Siva: అల్లు అర్జున్ సినిమా.. అసలు విషయం చెప్పిన కొరటాల

ఈ రోజు ఉదయం ఇడవేల బాబు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరయ్యారు. ఇక సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అతని అరెస్ట్ నమోదు చేసిన తర్వాత విడుదల చేశారు. ఇడవేల బాబు లైంగిక సామర్థ్యాన్ని కూడా పరీక్షించనున్నారు. విచారణ బృందం ఇడవేల బాబును మూడున్నర గంటల పాటు విచారించింది. ఆ తరువాత మధ్యాహ్నం అరెస్టు చేశారు. కోర్టు కఠిన షరతులతో ఇడవేల బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, నటుడు మరియు ఎమ్మెల్యే ముఖేష్ కూడా అత్యాచారం కేసులో దర్యాప్తు బృందం విచారించిన తర్వాత నిన్న అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఇడవేల బాబు, ముఖేష్‌లకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.