Leading News Portal in Telugu

Kali Trailer: ఇంట్రెస్టింగ్ గా నరేష్ అగస్త్య “కలి” ట్రైలర్


Kali Trailer: ఇంట్రెస్టింగ్ గా నరేష్ అగస్త్య “కలి” ట్రైలర్

Kali Movie Trailer: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ “కలి” మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. ‘నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ’ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్.

Iran: హిజ్బుల్లా కమాండర్లని చంపితే ఓటమి కాదు..ఇజ్రాయిల్‌పై ఇరాన్ వ్యాఖ్యలు…

ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరాం జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓ‌వర్ నవ్వించింది. ‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే…’ అనే డైలాగ్ “కలి” కథలోని సోల్ ను చెప్పింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి “కలి” సినిమా థ్రిల్లింగ్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.