Leading News Portal in Telugu

Tollywood Summer Releases : 2025సమ్మర్ రిలీజ్ సినిమాల లిస్ట్ చూశారా.. అన్నీ బ్లాక్ బస్టర్లే


Tollywood Summer Releases : 2025సమ్మర్ రిలీజ్ సినిమాల లిస్ట్ చూశారా.. అన్నీ బ్లాక్ బస్టర్లే

Tollywood Summer Releases : సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజ‌న్లకే సాధ్యం. ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో 2025 సంక్రాంతికి టాలీవుడ్‌లో అద్భుతమైన లైనప్ ఉంది. అస‌లు ఈ సీజన్లలో వచ్చే సినిమాలను చూస్తుంటే క్లిక్ అయితే అన్నీ వ‌రుస‌గా బడా ప్రాజెక్టుల‌తో టాలీవుడ్ స‌మ్మర్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అయిపోయేలా కనిపిస్తుంది.

2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు. అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి వర్ణం సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక బాలయ్య ఎన్‌బికె 109 సినిమాతో వస్తున్నాడు. సీనియర్ హీరోల పికప్‌తో సంక్రాంతి సీజన్ అంతా ఫిక్స్ అయింది. వేసవి సెలవులు రెండు నెలల పాటు కొనసాగుతాయి. ఈసారి మార్చి స్టార్టింగ్ నుంచి మే నెలాఖరు వరకు క్రేజీ సినిమాలు ఉండనున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను మార్చి 28న ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్‌లో మారుతి – ప్రభాస్ రాజా సాబ్ రానుంది. ఏప్రిల్ 10 రాజాసాబ్ విడుదల కానుంది. త్వరలో విజయ్ దేవరకొండ వీడీ 12 సినిమా లైన్‌లో ఉంది. మార్చి 28 అని ఫిక్స్ అయినట్లు సమాచారం.. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ 3’ సినిమా కూడా మే 1న విడుదల కానుందని.. రాకింగ్ స్టార్ యష్ సినిమా ‘టాక్సిక్’ ఏప్రిల్ 10న ఫిక్స్ అయింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జునల మల్టీ స్టారర్ కుబేర సినిమా సమ్మర్ సీజన్ లోనే విడుదల కానుంది. ఎన్బీకే109 సినిమా సంక్రాంతికి రాకపోతే వేసవిలో వస్తుంది. ఇవన్నీ హిట్ అయితే వేసవిలో థియేటర్లు కళకళలాడతాయి.