Leading News Portal in Telugu

SidduJonnalagadda : ‘జాక్ కొంచం క్రాక్’ నేపాల్ షెడ్యూల్ ఫసక్..


  • జాక్ షూటింగ్ లో సిద్దూ జొన్నలగడ్డ ఫుల్ బిజీ
  • నేపాల్ షెడ్యూల్ కంప్లిట్ చేసిన చిత్ర యూనిట్
  • త్వరలో రిలీజ్ కు రెడీ కానున్న ‘జాక్’ కొంచెం క్రాక్ 
SidduJonnalagadda : ‘జాక్ కొంచం క్రాక్’ నేపాల్ షెడ్యూల్ ఫసక్..

ఇటీవల ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ను సెప్టెంబ‌ర్ 15 నుంచి నేపాల్‌లో  స్టార్ట్ చేసారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బర్త్ డే వేడుకలు ఎస్ నేపాల్ షూట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. కాగా జెట్ స్ప్పేడ్ లో జరుగుతున్న ఈ సినిమా నేపాల్ షెడ్యూల్ ముగించింది యూనిట్. అందుకు సంభందించి వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. తమిళ సంగీత దర్శకుడు అచ్చు రాజ‌మ‌ణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.  గతంలో తెలుగులో నేను మీకు తెలుసా, రా రా కృష్ణయ్య వంటి సినిమాలకు అచ్చు సంగీతం అందించాడు.  జాక్ చిత్రంలోసిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ  క్రాక్ గాడు ఎందుకుంటాడ‌నేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.  సిద్దు సరేసన బేబి సినిమా ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య   హీరోయిన్‌గా న‌టిస్తుంది. చక చక షూటింగ్ ముగించి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్ . ప్ర‌సాద్.