Leading News Portal in Telugu

Bigg Boss 8 Telugu: బిగ్‭బాస్ హౌస్‌కి క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఒకేసారి ఆరు వైల్డ్‭కార్డు ఎంట్రీలు?


  • బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ఐదో వారం పూర్తి.
  • బిగ్‭బాస్ హౌస్‌కి క్యూ కట్టిన సెలబ్రిటీలు..
  • ఒకేసారి ఆరు వైల్డ్‭కార్డు ఎంట్రీలు?
Bigg Boss 8 Telugu: బిగ్‭బాస్ హౌస్‌కి క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఒకేసారి ఆరు వైల్డ్‭కార్డు ఎంట్రీలు?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ఐదో వారం పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేడు వారాంతరం ఆదివారం కావడంతో ఎపిసోడ్ కలర్ ఫుల్ గా కనపడేలా తీర్చిదిద్దారు బిగ్ బాస్ టీం సభ్యులు. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం., తాజాగా విడుదలైన ప్రోమోలో కనబడుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగ్ సినిమా నటీనటులు శ్రీవిష్ణు, రీతు వర్మ, దక్షలు స్టేజిపై ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత జనక అయితే గనక సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సుహాస్, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ సంగీర్తన స్టేజ్ పైకి వచ్చి సందడి చేసారు.

Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య

ఆ తర్వాత మా నాన్న సూపర్ హీరో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సుధీర్ బాబు, శివాజీ షిండేలు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. ఇంతమంది సెలబ్రెటీలు ఒకరు తర్వాత ఒకరు కనబడడంతో ఇవాల్టి ఎపిసోడ్ కాస్త ఫుల్ ఎంటర్టైనింగ్ ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

Most Expensive Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం.. ఎన్ని కోట్లో తెలుసా?

ఇక షో హోస్ట్ నాగార్జున చెప్పిన విధంగానే నేడు పాత బిగ్ బాస్ సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఆరుగురుని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అయితే, ఎవరెవరు వెళ్లారన్న సంబంధించిన వివరాలను తెలవలేదు. వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి ప్రస్తావించిన.. అక్కడ వారి ఫేస్లను మాత్రం రిలీవ్ చేయకుండా బిగ్ బాస్ టీం సభ్యులు జాగ్రత్త పడ్డారు. ఇకపోతే., బిగ్ బాస్ లీకుల సమాచారం మేరకు వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా టెస్ట్ తేజ, అవినాష్, హరితేజ, మెహబూబ్, నయని పావనిలు హౌస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం తాజా ప్రోమోను మీరు కూడా ఓ లుక్ వేయండి.