Leading News Portal in Telugu

Devara Collections : రూ.500కోట్లు దాటిన దేవర కలెక్షన్లు


Devara Collections : రూ.500కోట్లు దాటిన దేవర కలెక్షన్లు

Devara Collections :యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర.. సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై ఇన్ని రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను నాగవంశీ కొనుగోలు చేసారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది.

దేవరను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లాభాలే అని చెప్పాలి. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇటు తెలుగులోను మరే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లేకపోవడంతో దసరా సీజన్ ను దేవర ఫుల్ గా క్యాష్ చేసుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. మొదట్లో తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ‘దేవర’ రెండో భాగం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా షూటింగ్ కి హాజరు కానున్నాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ వచ్చే అవకాశం ఉంది.