Leading News Portal in Telugu

Bollywood: భయపెట్టి కాసుల పంట పండించుకుంటున్న బాలీవుడ్‌


Bollywood: భయపెట్టి కాసుల పంట పండించుకుంటున్న బాలీవుడ్‌

హారర్ కంటెంట్ కి బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లో ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అన్ని బాషల కంటే భిన్నంగా దెయ్యం సినిమా వస్తే చాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. దీంతో బాలీవుడ్‌ భవిష్యత్తును గాడిలో పెట్టేందుకు హిట్ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయలని చూస్తున్నారు. సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంటే, బీటౌన్ మాత్రం సక్సెస్ ఇచ్చే జానర్ కోసం ఎదురు చూసింది. రక రకాల ప్రయోగాలు చేస్తే హారర్ కంటెంట్ ఎట్టకేలకు క్లిక్ అయి బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్. గతంలో హిట్ అయిన భూల్ భులయ్యా2 కి సీక్వెల్ గా థర్డ్ పార్ట్ ని దీవాళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ క్రియేట్ చేసింది.కార్తీక్ ఆర్యన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.ఇది గనక హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టే.

Tollywood vs Bollywood: ఇక్కడ నో మ్యారీడ్ హీరోయిన్స్.. అక్కడ మాత్రం వండర్స్

బాలీవుడ్ లో ఈ ఏడాది కలెక్షన్స్ వర్షం కురిపించిన సినిమా స్త్రీ 2. 150 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 800 కోట్లు వచ్చాయి.ఒక్క నార్త్ లోనే 620 కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి థర్డ్ పార్ట్ ని అనౌన్స్ చేసింది శ్రద్దా కపూర్. ప్రీ పొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. 2025 ఫస్ట్ ఆఫ్ లో స్త్రీ 3 పట్టాలెక్కించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. బాలీవుడ్ లో ఈ ఏడాది 3 సినిమాలను రిలీజ్ చేశాడు అజయ్ దేవరగన్. ఇందులో సైతన్ బ్లాక్ బస్టర్ అయితే మైధాన్ , ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమాలు సో సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. ప్రజెంట్ సింగం అగైన్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న అజయ్ తర్వాత సైతన్ 2 స్టార్ట్ చేసేలా డేట్స్ కేటాయించాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. షెడ్యూల్స్ కూడా ఫిక్సయ్యాయి. అజయ్ సెట్స్ లో అడుగుపెడితే షూటింగ్ జెట్ స్పీడ్ తో మొదలవుతుంది. 2025 సెకండాఫ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతల ప్లాన్. మొత్తానికి ఈ ఏడాది వచ్చిన హారర్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో హిట్ ఫార్ములానే 2025లో కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్.