Leading News Portal in Telugu

I Was Tensed by Chiranjeevi Dance Grace Says Nagarjuna


Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వేడుక ఈ రోజు (సోమ‌వారం) 28 అక్టోబరున అట్ట‌హాసంగా జ‌రిగింది. అలా ఈ ఏడాదిగానూ ఏఎన్నార్‌ నేషనల్ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు అందజేశారు అమితాబ్‌ బచ్చన్‌.

Ram Charan : రామ్‌చరణ్‌ లుక్స్ అదుర్స్.. ఇది కదా కావాల్సింది!

ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా చిరంజీవికి అవార్డు ప్రకటించారు నాగార్జున. ఇక ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ నేను సినిమాల్లోకి వ‌ద్దామ‌నుకొన్న‌ప్పుడు ఓరోజు మా నాన్న‌గారు పిలిచారు. ‘అన్న‌పూర్ణ స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఓ పాట చేస్తున్నారు. నువ్వెళ్లి చూడు. నీకు ఉప‌యోగ‌ప‌డుతుంది’ అన్నారు. నేను సెట్ కి వెళ్లా. రాధ‌తో క‌లిసి వాన పాట తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి గారి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది. నేను అలా చేయ‌గ‌లనా? వేరే దారి చూసుకొందాం అనిపించింది’ అంటూ నాగార్జున‌ చెప్పుకొచ్చారు.