Leading News Portal in Telugu

Mahesh Babu’s Mythological Role Reports in Devaki Nandana Vasudeva is False


Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ అంటూ వార్తలు.. మేనల్లుడు బహిరంగ క్షమాపణ

మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ ఇప్పటికే హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన హీరోగా దేవకి నందన వాసుదేవ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని వచ్చే నెల 14వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. సూర్య కంగువ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా చివరిలో మహేష్ బాబు కృష్ణుడిగా కనిపించబోతున్నాడు అనే వార్తలు నిన్న క్కసారిగా తెరమీదకు వచ్చాయి. అయితే ఈ విషయం మీద మహేష్ బాబు అప్సెట్ అయ్యాడని కూడా ఆయన టీమ్ నుంచి సమాచారం అందింది. ఇప్పుడు అశోక్ గల్లా బహిరంగంగా క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహేష్ బాబు గారు కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారని వార్తలు తెరమీదకు వచ్చిన తర్వాత వెంటనే స్పందించినందుకు తనను క్షమించాలని కోరారు.

India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..

ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తెలియదు అలాగే లేటుగా స్పందించినందుకు సారీ. ప్రస్తుతానికి నేను న్యూయార్క్ లో మా తదుపరి సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తున్నాను. అందువల్ల సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలను నాకు తెలియలేదు. ఒకవేళ అలాంటి అతిథి పాత్ర ఏదైనా చేస్తే అది చాలా పర్సనల్గా, నా కెరీర్ మొత్తం మీద ఒక టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే నేనే ముందు షేర్ చేస్తాను. కాబట్టి ఈ విషయం అబద్ధం. మీరు అనవసరంగా ఈ విషయాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు త్వరలో థియేటర్లలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేయగా ప్రశాంత్ వర్మ కథ అందించారు. బాలకృష్ణ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.