Leading News Portal in Telugu

Salman Khan’s Ex-Girlfriend Somy Ali Claims the Bollywood Superstar Is Worse Than Gangster Lawrence Bishnoi


  • సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ చాలా బెటర్..

  • స్టార్ హీరో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు..
Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్‌ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..

Somy Ali: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ని మరోసారి నిందించింది ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ. సల్మాన్‌తో సోమీ అలీ 8 ఏళ్ల పాటు రిలేషన్‌ ఉంది. సల్మాన్‌ ఖాన్ తన మాజీ లవర్స్‌ అయిన సంగీతా బజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, మీతో ఎందుకు సంబంధాలు కలిగి లేడు అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు. సల్మాన్ నాతో ప్రవర్తించినట్లు, ఎవరితో ప్రవర్తించలేదని ఆమె చెప్పారు.

సల్మాన్ ఖాన్ తనని హింసించిన తీరులో సంగీతా, కత్రినా సగం కూడా ఎదుర్కోలేదని చెప్పారు. ఐశ్వర్యా రాయ్‌ని కూడా దారుణంగా తిట్టేవాడని చెప్పారు. సోమీ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కన్నా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నయం అని అన్నారు. సల్మాన్ నాకు చేసిన దాన్ని బట్టి చూస్తే.. బిష్ణోయ్ అతడి కన్నా గొప్పవాడని అన్నారు. సల్మాన్ తనను దారుణంగా కొట్టేవాడని, తన పరిస్థిని చూసి టబు ఒక్కసారి ఏడ్చేసిందని ఆమె పేర్కొన్నారు.‘‘నాకు తీవ్రమైన వెన్నునొప్పి ఉంది మరియు నేను చాలా కాలంగా మంచం పట్టాను. టబు నా పరిస్థితి చూసి తీవ్రంగా ఏడ్చింది కానీ సల్మాన్ తనను చూడటానికి రాలేదు’’ అని చెప్పారు.

సల్మాన్‌తో తనకు ఎదురైన కష్టాల గురించి తన తల్లి మరియు ఆమె సన్నిహితులు తప్ప ఎవరికీ తెలియదని కూడా సోమీ వెల్లడించింది. సల్మాన్‌తో తనకు ఉన్న సంబంధాలపై ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు చెప్పింది. 1999లో ఐశ్వర్య రాయ్ కన్నా ముందు సోమీ అలీతో సల్మాన్ ఖాన్ రిలేషన్‌లో ఉండేవాడు. ఇటీవల సోమీ అలీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ తనతో మాట్లాడాలని కోరారు. తనకు నెంబర్ ఇస్తే బిష్ణోయ్‌కి జూమ్ కాల్ చేస్తానని చెప్పారు.