Leading News Portal in Telugu

Amaran became a super hit talk in two Telugu states


  • శివ కార్తికేయన్ తాజా చిత్రం అమరన్
  • మేజర్ ముకుంద్ బయోపిక్ గా వచ్చిన అమరన్
  • దీపావళి కానుకగా రిలీజ్ అయిన అమరన్
SK : అమరన్ భారీగా అడ్వాస్స్ బుకింగ్స్.. కారణమేంటి..?

శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ+ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అడ్వాన్స్ బుకింగ్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అమరన్ తో పాటుగా రిలీజైన క, లక్కీ భాస్కర్, బఘీర సినిమాలను మించి ఈ సినిమా బుకింగ్స్ అదరగొడుతుంది. ఒక్క హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే కిరణ్ అబ్బవరం ‘క’ : 27 లక్షలు, శివకార్తికేయన్ ‘అమరన్’ : రూ.1.02 కోట్లు, దుల్కర్ సల్మాన్ ‘ లక్కీ భాస్కర్’ : రూ. 54 లక్షలు, శ్రీమురళి భఘీర : రూ. 10 లక్షలుగా ఉన్నాయి. శివకార్తికేయన్ సినిమాకు రావడం పట్ల ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇందుకు పలు రకాల కారణాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అమరన్ సినిమా బయోపిక్ కావడం, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడం, సాంగ్స్ సూపర్ హిట్ కావడం, మరిముఖ్యంగా ఈ సినిమాలో సాయిపల్లవి నటించడం తో ఈ సినిమాకు ఇంతటి భారీ కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. సూపర్ హిట్ తెచ్చుకోవడంతో ఈ ఈసినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది