Leading News Portal in Telugu

Sleeping happily after a long time . Thank you for Making this Diwali really happy for me .


  • క సినిమాకు సూపర్ హిట్ టాక్
  • స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం
kiran abbavarm : ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా

కిరణ్‌ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’. సుజీత్‌ – సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. స్పెషల్ ప్రీమియర్స్ నుండి ‘క’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు కిరణ్‌ అబ్బవరం సంతోషం వ్యక్తం చేసాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు నేడు పండగ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసాడు ఈ యంగ్ హీరో.

ఆ వీడియోలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి థాంక్స్ సో మచ్. నిన్నటి నుండి వస్తున్న కాల్స్, సోషల్ మీడియాలో మీ రివ్యూస్ చూస్తుంటే చాలా అంటే చాల సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ట్విట్టర్ లో అందరి హీరోల ఫ్యాన్స్ అందరూ మా ‘క’ సినిమాను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసారు. సినిమా చాలా బాగుంది అన్న అని మెసేజ్ లు చేస్తుంటే ,తన మనసు ఆనందంతో నిండింది. దీపావళికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. నేను ఏదైతే క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని నేను నమ్మానో ఈ రోజు నా నమ్మకం నిజం అని నిరూపించారు.‘‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా. ఈ దీపావళి నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు పేరు పేరునా అందరికి ధన్యవాదాలు. మీ అందరికీ హ్యాపీ దీపావళి , మీ అందరు ఫ్యామిలీ తో కలిసి క సినిమాకు వెళ్ళండి’ అని పేర్కొన్నారు.