Leading News Portal in Telugu

raveena ravi announced her boy friend


Industry News : ఆ డైరెక్టర్ తో ప్రేమలో మునిగి తేలుతున్న డబ్బింగ్ ఆర్టిస్ట్

Industry News : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. అలాగే ప్రముఖ దర్శకుడితో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విష‌యాన్ని త‌నే స్వయంగా ధృవీకరించడంతో సస్పెన్స్ వీడింది. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో ఆమె వంద పైగా సినిమాల‌కు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆమె మరెవరో కాదు ర‌వీనా ర‌వి.. నయనతారతో సహా పలువురు ప్రముఖ నటీమణులకు కూడా డబ్బింగ్ అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు రవీనా రవి కొన్ని హిట్ సినిమాల్లోను న‌టించారు.

లవ్ టుడే, మామన్నన్, ఒరు కిదయిన్ కరుణై మను వంటి చిత్రాలలో ర‌వీనా ర‌వి కీలక పాత్రలను పోషించారు. ఆమె నటనకు గాను చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు రవీనా రవి మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్‌తో తన సంబంధాన్ని కన్ఫాం చేశారు. సోష‌ల్ మీడియాల ద్వారా ఈ విష‌యాన్ని ర‌వీనా బహిర్గతం చేశారు. తన ప్రేమను ధృవీకరిస్తూ రవీనా రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు దేవన్ జయకుమార్‌తో క‌లిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోగ్రాఫ్ కి “నశ్వరమైన క్షణాల ప్రపంచంలో మేం శాశ్వతమైనదాన్ని కనుగొన్నాం.. కలిసి మేం మా కథను రాస్తాం“ అని క్యాప్షన్ ఇచ్చారు. పెళ్లి తేదీ తెలుసుకునేందుకు తొంద‌ర‌ప‌డే లోగానే, ఈ ప్రియమైన జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దేవన్ జయకుమార్ మలయాళం చిత్రం `వాలాట్టి`కి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా కుక్కల చుట్టూ నడిచే క‌థాంశంతో తెరకెక్కింది. సినిమాలో అమలు అనే కుక్కకి రవీనా రవి డబ్బింగ్ చెప్పి తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దర్శకుడు దేవన్ జయకుమార్, రవీనా రవి `వాలాట్టి` సినిమాకి ప‌ని చేసే సమయంలో ప్రేమ చిగురించిందని గుస‌గుస వినిపిస్తోంది.