Leading News Portal in Telugu

raashi khanna open comments up about her career plans


Rashi khanna : గేమ్ ప్లాన్ మార్చిన రాశీ ఖన్నా.. అమ్మడి రూటే సపరేటు

Rashi khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించాడు. ఆమె ఇటీవల ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో నటి రాశి ఖన్నా ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక ఉన్నా కానీ, తాను సినిమాల్లో విజయవంతమైన వ్యక్తిగా మారడం వెన‌క తన ఊహించని ప్రయాణం ఉందంటూ తెలిపింది. తన కెరీర్ మార్పును వివ‌రిస్తూ… రాశి ఖన్నా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా స్థిర‌మైన జీవితాన్ని కోరుకున్నాన‌ని తెలిపింది.

అయితే చివరికి నటన తనను పిలిచింద‌ని కామెంట్ చేసింది. నా విజయానికి విధి, స్థిర‌మైన‌ ఎంపికలే కార‌ణ‌మ‌ని తెలిపింది. త‌దుప‌రి `ది సబర్మతి రిపోర్ట్` గురించి ప్రశ్నించగా…మూవీ గురించి ఎక్కువ వెల్లడించకూడదని నిర్ణయించుకుంది. ఆమె కెరీర్‌లో కీల‌క‌మైన చిత్రంగా భావిస్తోంది. దీనికి కార‌ణం .. ప్రభావవంతమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఊహించిన ప్రాజెక్ట్ ఇది. రాశీ ఖన్నా ఇటీవ‌ల తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల్లో న‌టించింది. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ ఫ‌ర్జీలోను కీల‌క పాత్ర పోషించింది. మునుముందు మ‌రిన్ని వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. తెలుసు క‌దా.. అగాథియా లాంటి సినిమాల్లో నటించింది.