Leading News Portal in Telugu

Rashmika posted photos on Instagram, celebrations of her Diwali.


  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్.
  • తెల్ల డ్రెస్ లో అబ్బురపరిచిన నేషనల్ క్రష్.
Rashmika Mandanna: మొత్తానికి హింట్ ఇచ్చేసిన నేషనల్ క్రష్.. అక్కడే దీపావళి చేసుకుందా?

Rashmika Mandanna photos Viral: రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరున్న ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ తన టాలెంట్ నిరూపించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ లో నటిస్తోంది. వీటితోపాటు మరిన్ని సినిమాలలో కూడా నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. కాస్త షూటింగ్ మధ్య విరామం తీసుకుని దీపావళి పండుగ జరుపుకుంది. పండుగకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా రష్మిక షేర్ చేసింది. అయితే, రష్మిక షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా నెటిజెన్స్ రష్మిక దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు కామెంట్ చేస్తున్నారు.

రష్మిక మందన్న తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేయగా.. అందులో తెల్లటి డ్రెస్ వేసుకొని దీపాలను పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలను పంచుకున్న తర్వాత.. ఈ పిక్స్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తీసినట్లుగా ఫోటో క్రెడిట్ టూ అంటూ ఆనంద్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ.. ‘థాంక్యూ.. ఆనంద’ అని కామెంట్ చేసింది. దీంతో ఆవిడ అభిమానులు విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక దీపావళి పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అనేకమార్లు రూమర్లు వచ్చాయి. అయితే వీటిపై వీరు ఇప్పటికి స్పందించలేదు. వీరిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. చూడాలి మరి వీరిద్దరూ వారి ప్రేమను ఎప్పుడు బయట పెడతారో.