Leading News Portal in Telugu

Jr NTR at Narne Nithiin Engagement


Narne Nithiin: హిట్టు కొట్టి సైలెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ బామ్మర్ది

జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగ ప్రవేశం చేసిన నార్నె నితిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మాడ్ అనే సినిమాల్లో ముగ్గురు హీరోలలో ఒక హీరోగా కనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ మధ్యనే ఆయ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారు దసరాకి రిలీజ్ అవుతుందని అనుకున్నా అనుకోకుండా అది రిలీజ్ వాయిదా పడింది.

Dulquer Salmaan: చూడటానికలా ఉంటాడు కానీ ఎంతో టాలెంట్ ఉంది!

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటంటే ఎవరికి తెలియకుండా ఆయన సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు తెలిసింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎంగేజ్మెంట్ కి హాజరైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అప్పటివరకు నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ జరుగుతుందనే విషయం కూడా చాలామంది ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్లో కూడా సమాచారం లేదు. ఇక ఆయన వివాహం చేసుకోబోతున్న యువతి వివరాలు కూడా లేవు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఈ నిశ్చితార్థానికి హాజరైనప్పటి ఒక వీడియో మాత్రమే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. దీంతో హిట్టు కొట్టి సైలెంట్ గా బావమరిది పెళ్లి చేసుకుంటున్నాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.