Leading News Portal in Telugu

Jagapathi Babu in Sai Dharam Tej SDT 18


SDT 18: ధరమ్ తేజ్ సినిమాలో జగపతిబాబు.. భయపెడుతున్నాడే!

సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రగ్గడ్ లుక్ లో ప్రెజంట్ చేసిన జగపతిబాబు ఇంట్రో పోస్టర్ చాలా క్యూరియాసిటీ పెంచింది. ఇటివలే రిలీజ్ చేసిన “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Sridevi: రజనీకాంత్ తో శ్రీదేవి పెళ్లి ప్లాన్? బోనీ కపూర్‌ వల్ల మొత్తం మటాష్!

ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది. #SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.