Leading News Portal in Telugu

Naga Chaitanya Comments on Sai Pallavi At Thandel Press Meet


Naga Chaitanya :సాయి పల్లవితో డాన్స్ అంటే భయం!

తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను. ఆయన ముందు సినిమా చూపించండని అడిగారు. నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అంటే ఇలానే తీయాలి. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం.

Bunny Vasu: ఫిబ్రవరి 6 మంచి షర్ట్ కొనండి. 7 వ తారీఖు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు!

వారి కష్టం దేశం అంతా షేక్ చేసింది. మేము ఎడిట్ చూశాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. ఫిబ్రవరి7 డేట్ పై నేను చాలా సంతోషంగా వున్నాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. 100% లవ్ సినిమాతో వాసుతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. చాలా పెద్ద కాన్వాస్ సినిమా ఇది. ఈ పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించాలని డైరెక్టర్ చందూ చాలా కష్టపడ్డారు. సాయి పల్లవి క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌. తన పాత్ర గురించి కాదు అన్ని పాత్రల గురించి ఆలోచిస్తూ చాలా సపోర్ట్ చేస్తుంది. ఆమెతో డాన్స్ చేయాలంటే భయం అని పేర్కొన్న ఆయన ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం. అందరికీ థాంక్ యూ.’ అన్నారు