- నివిన్ పౌలీపై లైంగిక ఆరోపణల కేసు
- నివిన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన విచారణ బృందం
- ఆధారాలు లేవని తేల్చేసిన పోలీసులు
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాలీవుడ్ కు చెందిన ఓ నటి ఫిర్యాదుతో నివిన్ తో పాటు మొత్తం ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ మా కోరిక తెరిస్తే సినిమా అవకాశం ఇస్తామని బెరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి. మలయాళ చిత్రం పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదిక బయటపెట్టింది.దాంతో ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను మీడియా ముందు వెల్లడించడంతో మాలీవుడ్ లో కలకలం రేగింది.
ఈ నేపథ్యంలో నటుడు నివిన్ పౌలిపై సదరు నటి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నెల పాటు సాగిన విచారణలో నివిన్ పౌలికి క్లీన్ చిట్ ఇచ్చారు. నివిన్ పౌలి ఆ నటిని లైంగికంగా వేధించినట్లు ఎక్కడ స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని తెలిపింది. సదరు నటిపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో హీరో నివిన్ అక్కడలేడని డీవైఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం కేరళలోని కొత్తమంగళం కోర్టుకు నివేదికను సమర్పించింది. దీంతో నిందితుల జాబితాలో ఆరో వ్యక్తిగా ఉన్న నివిన్ పౌలీని ఈ కేసునుండి తొలగించారు. మిగిలిన ఐదుగురిపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు. అటు నివిన్ సైతం ఈ క్లిష్ట సమయంలో తనను అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఇటు నివిన్ పౌలికి క్లీన్ చిట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా లో నివిన్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు