Leading News Portal in Telugu

Get set for a thrilling night filled with pure energy and electrifying moments at the Kanguva Grand Pre-Release Event


  • సూర్య పాన్ ఇండియూ సినిమా కంగువ
  • నేడు కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిధులుగా టాలీవుడ్ బడా డైరెక్టర్స్
Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావట్లేదు..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

కాగా ఈ రోజు ‘కంగువ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా టాలీవుడ్ దర్శక దిగ్గజం SS రాజమౌళి తో పాటు సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను హాజరుకానున్నారు. అయితే ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని అందరు ఊహించారు. కంగువ సినిమాను ప్రభాస్ స్నేహితులైన యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ స్టూడియో గ్రీన్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈవెంట్ కు వస్తాడని ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆశించారు, కానీ హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్ లో రెబల్ స్టార్ బిజీగా ఉన్న కారణంగా  ఈవెంట్ కు రావట్లేదని సమాచారం.