Leading News Portal in Telugu

Shah Rukh Khan receives death threat call


  • మరో బాలీవుడ్ హీరోకు బెదిరింపులు..

  • షారుఖ్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ వార్నింగ్..

  • ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Shah Rukh Khan: నెక్స్ట్ చంపేది షారుఖ్‌ ఖాన్‌నే అంటూ బెదిరింపులు..

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. దుండగులు షారుఖ్ కు కాల్ చేసి నెక్ట్స్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అలర్టైన బాంద్రా పోలీసులు ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక, కాల్‌ను ట్రేస్ చేసి రాయ్‌పూర్ లోని ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.

కాగా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి గంత కొంత కాలంగా వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సల్మాన్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ నుంచి ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కి చెందిన 32 ఏళ్ళ వ్యక్తితో సల్మాన్ కి బెదిరింపులు వస్తున్న కేసుతో సంబంధం ఉందని తేల్చారు. కర్ణాటకలో నిందితుడు పట్టుబడగా మహారాష్ట్ర పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.