Leading News Portal in Telugu

official announcement on dhanush next movie d55


D55 : ‘అమరన్’ డైరెక్టర్ తో ధనుష్.. మూవీ షురూ

D55 : దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ మంచి హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ముకుంద రాజన్ పాత్రలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. అక్టోబర్ 31న విడుదలైన అమరన్ మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీశారని పెరియస్వామిని కొనియాడుతున్నారు.

ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అమరన్ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అన్నీ సెట్ అయ్యాయని వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ నేడు పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈరోజు చెన్నైలో ధనుష్ 55వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. D55పేరుతో అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి గోపురం ఫిలిమ్స్ బ్యానర్ పై జి అన్బుచెజియన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.