Leading News Portal in Telugu

Kris Venugopal and Divya Sridhar marry in intimate ceremony at Guruvayur


Divya Sridhar: 50 ఏళ్ల నటుడితో 40 ఏళ్ల నటి రెండో పెళ్లి

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. ఓ మలయాళ సీరియల్ నటి తనకంటే 11 ఏళ్లు పెద్దదైన ఆధ్యాత్మిక గురువు కం నటుడిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దివ్య శ్రీధర్ మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి మలయాళంలోనే కాకుండా అనేక తమిళ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూ టీవీ షోలలో నెగిటివ్ పాత్రలు పోషించి ఫేమస్ అయింది. అయితే పెళ్లి తర్వాత దివ్య నటనకు దూరంగా ఉంది. ఆమెకు దేవానంద్ అనే కూతురు కూడా ఉంది. నటి దివ్య తన భర్తతో విభేదాల కారణంగా 2019 లో తన భర్త నుండి విడిపోయింది. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఆయన మలయాళంలో పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న దివ్య శ్రీధర్ గత వారం 50 ఏళ్ల నటుడు క్రిస్ వేణుగోపాల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు.

Jr NTR : తమిళ్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!!

క్రిస్ వేణుగోపాల్ ఆధ్యాత్మిక గురువు, మోటివేషనల్ స్పీకర్ మరియు ప్రముఖ టీవీ నటుడు కూడా. గురవాయూర్ ఆలయంలో జరిగిన రహస్య వివాహానికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి దివ్య పిల్లలు కూడా హాజరయ్యారు. దివ్య – క్రిస్ మొదటిసారి టీవీ షో పతిరమట్టు సెట్స్‌లో కలుసుకున్నారు. సెట్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వెంటనే తదుపరి అడుగు వేశారు. ఇద్దరూ ప్రేమించుకుని 30వ తేదీన గురువాయూర్ దేవాలయంలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దివ్య-క్రిష్ వేణుగోపాల్ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో చాలా మంది ఈ పెళ్లిని ఇంటర్నెట్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దివ్య స్పందిస్తూ.. సెక్స్ మాత్రమే జీవితమా? నా వయసును చూసి వెక్కిరించేవాళ్ళతో నాకు అనవసర. నా పిల్లలకు మంచి తండ్రి దొరికాడు అని ఆమె చెప్పుకొచ్చింది.