Leading News Portal in Telugu

Devaki Nandana Vasudeva Releasing on November 22nd


Devaki Nandana Vasudeva: వెనక్కి తగ్గిన ‘దేవకీ నందన వాసుదేవ’

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు కంగువ, మట్కా సినిమాలు రిలీజ్ కి ఉండడంతో విడుదల తేదీని ఒక వారం ముందుకు తీసుకెళ్లారు. దేవకీ నందన వాసుదేవ ఇప్పుడు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa 2 : తగ్గేదేల్యా.. ట్రైలర్ లాంచ్ నార్త్ లోనే!

ప్రమోషన్ల కోసం మేకర్స్ కి ఒక వారం అదనంగా దొరికినట్టయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో పాటలు, గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమాలో అశోక్ గల్లా కంప్లీట్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్ సూచించినట్లుగా ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డివైన్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ని శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.