Leading News Portal in Telugu

Shraddha Das Sung Yolo Song in Kanguva Movie


Shraddha Das: ‘కంగువ’లో పాట పాడిన టాలీవుడ్ హీరోయిన్

ఈ మధ్యకాలంలో నటులు నటీమణులు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. కొంతమంది దర్శకత్వ ప్రతిభ చాటుకుంటుంటే మరికొంతమంది రచయితలుగా అవతారం ఎత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ సింగర్ అవతారమెత్తింది. ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్ ఇప్పటివరకు నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ప్లే బాక్స్ సింగర్ అవతారం ఎత్తింది. ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవిశ్రీప్రసాద్ పరిచయం చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే సూర్య హీరోగా కంగువ అనే సినిమా తెరకెక్కింది. శివ దర్శకత్వంలో ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా బాబీ డియోల్ సహా అనేక మంది కీలకమైన నటీనటులు కీలక పాత్రలలో నటించారు.

Bigg Boss 8 : ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్

ఈ సినిమా 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన యోలో సాంగ్ ఇప్పటికే అందర్నీ ఎలా దించడమే కాదు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కూడా సాధించింది. ఈ సాంగ్ ని శ్రద్ధాదాస్ ఆలపించినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, శ్రద్దా దాస్, సాగర్ కలిసి ఈ పాట పాడారు. రాకేందు మౌళి అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ సాగర్లతో పోటీగా శ్రద్ధాదాస్ వాయిస్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ మధ్యకాలం హైదరాబాదులో జరిగిన మ్యూజికల్ ఈవెంట్లో దేవిశ్రీప్రసాద్ తో కలిసి శ్రద్ధా దాస్ కూడా కొన్ని పాటలు పాడి ఆ ఈవెంట్ కి హాజరైన అందరినీ ఆకట్టుకున్నారు.