Leading News Portal in Telugu

Komatireddy Venkat Reddy Comments on Movie Industry


Komatireddy Venkat Reddy: చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది!

నాకు సినిమాలంటే చాలా ఇష్టం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు చిత్రపురి కాలనీ లేఅవుట్‌లో ఇళ్లు ఇస్తాం అని అన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది అని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారని అన్నారు. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు.

Kanguva: అంచనాలు పెంచేస్తున్న సూర్య ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్

అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో 16,000 మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో చాలా మంది సభ్యులకు నివాస స్థలాలు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇళ్లు మంజూరు చేయించాలని మంత్రిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. దానికి మంత్రి హామీ ఇచ్చారు.