- మరోసారి మానవత్వం చాటుకున్న అనన్య నాగళ్ళ
- ఇతరులకు సాయం చేయడంలో దైవత్వం ఉందని గ్రహించిన అనన్య
- పేదలకు – నిరాశ్రయులకు బ్లాంకెట్స్ పంచిన అనన్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అనన్య నాగళ్ళ. ఒకవైపు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలోను ఈ తెలుగమ్మాయి ముందుంటుంది. ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ తన వంతుగ కృషి చేస్తుంటుంది అనన్య. ఇటీవల తెలుగు రాష్టాల్లో వరదలు వచ్చిన సమయంలో కూడా అందరి కంటే ముందుగా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందించింది.
తాజాగా అనన్య నాగళ్ళ మరోసారి తన ఉదార మనసును చాటుకుంది. ఎందరో నిరాశ్రయులు రోడ్ పక్కన అర్ధరాత్రి పూట నిద్రిస్తూ ఉంటారు. వారికీ కనీసం కప్పుకునేందుకు దుప్పటి కూడా ఉండదు. అటువంటి వారిని తరచూ చూస్తూ చలించిన అనన్య వారికీ తగిన సాయం చేసేందుకు నడుం బిగించింది. అలా హైదరాబాద్ బస్టాండ్ వద్ద బయట నిద్రిస్తున్న పలువురిని చూసి చలించి పోయిన అనన్య అక్కడ చలిలో నిద్రిస్తున్న ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు పంపిణి చేసింది. చలికాలం మొదలవ్వడంతో ఎందరో నిరాశ్రయులు ఇలా ఇబ్బంది పడుతుండడంతో తన వంతు బాధ్యతగా ఇలా దుప్పట్లు సాయం చేసింది తెలుగు అమ్మాయి అనన్య. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన నెటిజన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాలలో మాత్రమే స్టార్స్ అని, కానీ మన తెలుగు అమ్మాయి అనన్య నిజ జీవితంలో స్టార్ హీరోయిన్ అని కొనియాడుతున్నారు.
A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍
Truly Heartwarming #Humanity 💫#Ananyanagalla pic.twitter.com/w6aYd2iMHl
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 12, 2024