Leading News Portal in Telugu

The Rana Daggubati Show premiering on November 23 in Prime Video


The Rana Daggubati Show : సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలు వెలికి తీసేందుకు ది రానా దగ్గుబాటి షో!

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి నిర్మించి, క్రియేట్ చేసి, హోస్ట్ చేస్తున్న ఓ సరికొత్త అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్‌ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఎనిమిది ఎపిసోడ్ల ఈ కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని, రానాతో అన్ ఫిల్టర్డ్ సంభాషణలు, ఎక్సైటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొననున్నారు. ఈ షోలో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య అక్కినేని, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు పాల్గొంటారని నవంబర్ 23 నుంఛి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ప్రసారం కానున్న ఈ షోలో ప్రతి శనివారం ఒక కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుందని తెలుస్తోంది.

Posani : పోసాని కృష్ణమురళిపై కేసు

ఫిల్టర్‌ చేయని సంభాషణలు, సెలబ్రిటీల గురించి తెలియని కోణాలతో సెలబ్రటీ టాక్‌ షోకు కొత్తదనాన్ని తీసుకురానుంది ది రానా దగ్గుబాటి షో. తనతో పాటు తన అతిథుల్లో సరదా కోణాన్ని బహిర్గతం చేయనున్న రానా, వెండితెరకు ఆవల వారి ఫన్ యాక్టివిటీస్, వారి పాషనేట్ హాబీస్, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఫ్యాన్స్‌కు తెలియని, ఈ ప్రపంచం వినని విషయాలు ఈ షో ద్వారా తెలియజేయనున్నారు. ఎక్స్ ట్రార్డినరీ గా ఉండే ది రానా దగ్గుబాటి షోలో మైమరపింపజేసే సంభాషణలు, ఆకట్టుకునే యాక్టివిటీస్ తో రానానే కాదు ఈ షోకు వచ్చే ఆయన ఆతిధులు కూడా పూర్తిగా లీనమైపోతారు. పరిశ్రమలో కొందరు ప్రముఖ వ్యక్తుల గురించిన ఎవరికీ తెలియని విషయాలు ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తాయని భావిస్తున్నారు.