Leading News Portal in Telugu

Rajini and Kamal will compete once again in summer


  • ఒకే నెలలో రిలీజ్ కానున్న కమల్, రజనీ సినిమాలు
  • థగ్ లైఫ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మేకర్స్
  • కూలీ కూడా అదే డేట్ కు వచ్చే ఛాన్స్
Kollywood : బాక్సాఫీసు బరిలో బెస్ట్ ఫ్రెండ్స్.. గెలిచేది ఎవరో..?

ప్రజెంట్ కోలీవుడ్ గాడ్ ఫాదర్స్ ఎవరంటే.. రజనీకాంత్, కమల్. ఈ ఇద్దరు కేవలం స్టార్‌ హీరోలే కాదు.. మంచి దోస్తులు కూడా. ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసిస్తూ.. సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోల మధ్య వార్ రాబోతుందని టాక్. మరీ దోస్తానా కటీఫ్ కావడానికి దోహదపడుతున్న కారణాలేమిటీ..?  నాయగన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. మూవీపై ఎక్స్ పర్టేషన్స్ పెంచేసింది. ఇదే సమయంలో నెక్ట్స్ ఇయర్ జూన్ 5న థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇదే సమయంలో ఉళగనాయగన్‌ను ఢీ కొట్టేందుకు తలైవా రెడీ అయినట్లు వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కూలీని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీని కూడా జూన్ నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న రిలీజ్ చేయాలని ఎప్పటి నుండో డైరెక్టర్, ప్రొడ్యూసర్ డిస్కర్షన్ చేస్తున్నట్లు ఇన్నర్ టాక్. ఇప్పుడు ఇదే డేట్‌పై కమల్ కర్చీఫ్ వేయడంతో కూలీ టీం ఆలోచనలో పడింది. అయినా సరే జూన్ 5కే లేదా ఆ వారంలోనే కూలీని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. థగ్ లైఫ్, కూలీ సినిమాలు ఒకే రోజు లేదా వారంలో గ్యాప్‌లో రిలీజ్ చేస్తే రజనీ, కమల్ మధ్య డైరెక్ట్ క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే 2005 సీన్ రిపీట్ కానుంది. ఆ ఏడాది కమల్ ముంబయి ఎక్స్ ప్రెస్, రజనీ చంద్రముఖి ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇందులో చంద్రముఖి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మరి ఇద్దరు అదే డేట్ కు వస్తారా లేదా ఒకరు ముందుకు వస్తారా అనేది రాన్నున్న రోజుల్లో తేలనుంది.