Leading News Portal in Telugu

Budget Boundaries News on Mahesh Babu and Rajamouli Film Goes Viral


SSMB 29: రాజమౌళి – మహేష్ సినిమాకి నో లిమిట్స్

ఇండియా మొత్తం మీద ఉన్న దర్శకులు అందరూ అసూయపడే ఏకైక దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ఎస్ రాజమౌళి. ఒకప్పుడు తెలుగు సినీ దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన చేస్తున్న సినిమాలు దాదాపుగా ఒక్కొక్క రికార్డు బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఆయన సినిమాల రికార్డులు మళ్ళీ ఆయన మాత్రమే బద్దలు కొట్టేలా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కేఎల్ నారాయణ నిర్మాతగా కొన్ని సంవత్సరాలు క్రితం ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ కి అనుగుణంగా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా గా కాదు పాన్ వరల్డ్ గా చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో పలు దేశాల్లో షూట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

NBK 109: టైటిల్ విషయంలో బాలయ్య మాటే ఫైనల్

1000 కోట్ల బడ్జెట్ అని 1200 కోట్లు బడ్జెట్ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే స్క్రిప్ట్ ఫైనల్ అయింది కానీ బడ్జెట్ ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కోసమే కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఈ సినిమా విషయంలో కూడా ఇప్పటివరకు బడ్జెట్ ఫైనలైజ్ కాలేదు. కుదిరినంత ఖర్చు పెట్టుకుంటూ వెళ్లాలని బడ్జెట్ విషయంలో ఎలాంటి బౌండరీస్ పెట్టుకోకూడదు అని రాజమౌళితో పాటు నిర్మాత నారాయణ కూడా ఎక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా చెప్పబడుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మొదటి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు రెండేళ్ల పాటు షూట్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. స్పెషల్ వర్క్ షాప్స్ కూడా చేస్తున్నాడు. మొత్తం మీద రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన బడ్జెట్ వ్యవహారాలు ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.