Leading News Portal in Telugu

Nithiin Robinhood Official Teaser Starring Sreeleela Directed by Venky Kudumula


Robinhood : నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈరోజు అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ నెరేటివ్ కి టోన్‌ని సెట్ చేస్తుంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

TG Vishwa Prasad: భారీగా నష్ట పోయాం.. టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు

ఈ సారి, టీజర్ నితిన్ పాత్రపై మరింత ఇన్ సైట్ ని అందిస్తూ, మూవీ ప్రిమైజ్ ని గ్లింప్స్ గా అందిస్తుంది. వినోదం, యాక్షన్, బ్రెత్ టేకింగ్ మూమెంట్స్ బ్లెండ్ తో దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేశాడు. నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టారు, డిఫరెంట్ లుక్‌లలో డైనమిక్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఒక సీన్ నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్, మరో సీన్ లో అరబ్ షేక్‌గా కనిపించి తీరు విశేషంగా అలరించింది. సినిమా రెండు విభిన్న కోణాలను, నితిన్ వెర్సటాలిటీని హైలైట్ చేస్తుంది. శ్రీలీల రిచ్ అండ్ ఆరోగేంట్ గర్ల్ గా తన పాత్రలో అలరించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో పాత్రలను కూడా టీజర్ పరిచయం చేసింది. సాయి శ్రీరామ్ తన అద్భుతమైన కెమెరా పనితనంతో రిచ్ నెస్ తీసుకొచ్చారు. జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో భావోద్వేగాల ఎలివేట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సినిమాపై ఈ టీజర్ అంచనాలను పెంచింది.