Leading News Portal in Telugu

NBK 109 Titled as Dhaku Maharaj Teaser is out


Daaku Maharaj: గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు ఈ డాకు మహారాజ్

వీర సింహారెడ్డి లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్.బి.కె 109. తెలుగులో పాలు హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఈరోజు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ సగర్వంగా నిర్మిస్తున్నారు.

Yamudu : యముడు ఫస్ట్ లుక్ రిలీజ్

స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే థమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఆయన అన్నట్టుగానే తమన్ ఎప్పటిలాగే తనదైన మ్యూజిక్ తో టీజర్ మొత్తాన్ని వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళాడు ఇక టీజర్ ని పరిశీలిస్తే ఒక రేంజ్ లో కట్ చేశారు మేకర్స్.