Leading News Portal in Telugu

Tamil Films Producer Council’s Condemn Letter Regarding Personal Attack in Film Reviews & Youtube Reviews


  • తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం
  • రిలీజ్ సినిమాలపై కొందరి విషప్రచారం
  • కట్టడి చేసేందుకు థియేటర్స్ కు ఆదేశాలు
Kollywoood : తమిళనాడు నిర్మాతల కౌన్సిల్ సంచలన నిర్ణయం

తమిళనాడు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత మంది యూట్యూబ్‌ ఛానల్స్‌, నెటిజన్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూయార్స్ వారి వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూ స్ ఇస్తున్నారని భావిస్తూ సంచలన డెసిషన్ తీసుకుంది  తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌.  ఈ ఏడాది తమిళ్ లో విడుదలైన చాలా సినిమాలు నెగిటివ్ వలన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేదని నిర్మతల మండలి చెప్తోంది. కొందరు కావాలని తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయితే సినిమా చూడకుండే రివ్యూలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘ఇండియన్‌ 2’ పై యూట్యూబ్ ఛానెల్స్ దారుణమైన థంబ్ నెయిల్స్ తో సినిమాను దారుణంగా ట్రోల్ చేసారు. ఫలితం తమిళ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ‘వేట్టయన్‌’ సంగతి కూడా ఇదే పరిస్థితి . ఇక సూర్య నటించిన ‘కంగువా’ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓవర్సీస్ టాక్ ను ఆధారంగా చేసుకుని తమిళ్ లో మొదటి ఆట ముగియకుండానే పబ్లిక్‌ టాక్‌, పేరుతో యూట్యూబ్‌ ఛానల్స్‌ చీల్చి చెండాడాయి.   రానున్న రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుందని భావించిన  తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌  ఇక  యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని, ఫస్ట్‌ డే.   రిలీజ్ రోజు  థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు చెప్పే వెసులుబాటు ఇవ్వొద్దని థియేటర్ ఓనర్స్ కు సూచిస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఇకపై  అలా చేస్తే చూస్తూ ఉరుకోము’’ అని పేర్కొంది