ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లు మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మొత్తం ఇప్పటి వరకు వర్మపై ఏపీలో 3 కేసులు నమోదు అయినట్టు అయింది.
Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదయింది. అంతేకాక హైదరాబాదు వచ్చిన పోలీసులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న మేరకు షూటింగ్ లు ఉన్నందున తాను నాలుగు రోజుల తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని వర్మ వాట్సాప్ ద్వారా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఇక తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని భావించిన రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.