Leading News Portal in Telugu

Allu Arjun’s sensational comments: The police cleared my way into the theater


  • నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను
  • వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు
  • నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు
  • అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు -అల్లు అర్జున్‌
Allu Arjun: నాకు థియేటర్లోకి పోలీసులే దారి క్లియర్ చేశారు…అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అసలు ఆరోజు థియేటర్లో ఏం జరిగిందో అల్లు అర్జున్ తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. నేనేమీ బాధ్యత లేకుండా అ థియేటర్ కి వెళ్ళలేదు. గత 20- 30 ఏళ్లుగా అదే థియేటర్ కి వెళుతున్నాను. నా సినిమాలకు మాత్రమే కాకుండా బయట సినిమాలకు కూడా బోలెడు సినిమాలకు వెళ్లాను. ఎప్పుడూ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. నేను బాధ్యత లేకుండా థియేటర్ కి వెళ్లాను పర్మిషన్ లేకుండా వెళ్లాను అంటున్నారు. అది ఖచ్చితంగా తప్పుడు సమాచారం. థియేటర్ వాళ్లు పర్మిషన్ విషయంలో క్లారిటీ తెచ్చుకున్నారని తెలియడంతోనే అక్కడికి వెళ్లాను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులే దారి క్లియర్ చేస్తున్నారు.. పోలీసుల డైరెక్షన్లోనే నేను వెళుతున్నాను అంతా క్లియర్ అయిపోయింది అని అనుకున్నాను.

Allu Arjun: నాకు థియేటర్లోకి పోలీసులే దారి క్లియర్ చేశారు…అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

. ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకుండా ఉంటే అలా లేనప్పుడు వాళ్ళు వచ్చి చెబుతారు మీకు పర్మిషన్ లేదు అని చెబితే మేము వెనక్కి వెళ్ళిపోతాం.. వాళ్లే క్లియర్ చేసి ముందుకు రమ్మన్నారంటే పర్మిషన్ ఉందనే కదా మేము అనుకుంటాము. నేను అలాగే ఆలోచించాను, అలాగే నేను చెప్పాల్సింది ఏంటంటే? అసలు ఆరోజు రోడ్ షో చేశాను అని కూడా నామీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కానీ అది కూడా నిజం కాదు. థియేటర్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉండగా కారుకి ప్రేక్షకులు అడ్డం వచ్చేశారు. ఒక పాయింట్ తర్వాత జనం గుమికూడుతున్నారు అనుకున్న సమయంలో ఒక్కొక్కసారి బౌన్సర్లు పోలీసులే మీరు ఒకసారి కనిపించండి ఒకసారి చేయి ఊపండి వాళ్ళు వెళ్లిపోతారని చెబుతారు. నేను అలా చెప్పిన ప్రతిసారి బయటకు వచ్చి చేయి ఊపుతాము, వాళ్ళు వెళ్ళిపోతారు. అది నేను మాత్రమే కాదు ఏ సెలబ్రిటీ అయినా మీరు కనుక్కోవచ్చు.

చేయి ఊపితేనే చూసిన ఫీలింగ్ కలిగి వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. ఆ ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చి చేయి ఊపాను. నేను నా ప్రింటెడ్ కారు లోపల దాక్కొని కూర్చుని ఉన్నాను కానీ అక్కడికి వచ్చిన వేలాదిమందిని నేను గౌరవించాలి. అంత మంది అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోని ఒకసారి చూపించాలి. అది కూడా నేను చూపించలేకపోతే నేను ఎంత గర్వం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్లు అంత ప్రేమ చూపిస్తుంటే ఆ నేను కూర్చుని సర్లే వచ్చారులే అనుకుంటానా ? అరే అని బయటకు వచ్చి ఒక్కసారి అందరికీ నమస్కారం చేశాను. థాంక్యూ థాంక్యూ అని చెప్పి పదండి థియేటర్ లోపలికి వెళ్ళండి అని చెబుతూ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అది పోలీసులు కానీ బౌన్సర్లు కానీ ప్రతిసారి అడిగేదే అని అన్నారు.