Leading News Portal in Telugu

Allu Aravind Reaction On CM Revanth Reddy Comments


Allu Aravind: ఇంత పెద్ద హిట్ సినిమా చేసినా ఓ మూలన కూర్చుని ఉంటున్నాడు!

ఈరోజు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన అనంతరం అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లీగల్‌గా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి అల్లు అర్జున్ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయాడు అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. దయచేసి అందరూ సహకరించగలరు అని పేర్కొన్న ఆయన సినిమా ఎలా ఉందో ఇప్పటికీ స్వయంగా బన్నీ చూసుకునే అవకాశం లేదు..

Allu Arjun: పోలీసులు నాకు ఏం చెప్పలేదు.. అసలు విషయం బయట పెట్టిన అల్లు అర్జున్ !

అల్లు అర్జున్ మా గార్డెన్‌లో చివరకి ఓ మూలన వచ్చి కూర్చుని రోజు బాధపడుతున్నాడని అన్నారు. ఒక పక్క సినిమా హిట్ అయినందుకు తండ్రిగా గర్వపడుతున్నా, మరో పక్క నాకు చాలా బాధగా ఉంది అని అల్లు అరవింద్ అని అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినా రెండు వారాలుగా అర్జున్ ఎక్కడో ఓ మూలన కూర్చుని ఉంటున్నారని, ఈ తొక్కిసలాట ఘటన వల్ల వల్ల సెలబ్రేషన్స్ కూడా చేయడం లేదు, అ తండ్రిగా అతన్ని చూస్తూంటే నాకే కడుపు తరుక్కుపోతోంది. 22 ఏళ్లు కష్టపడి పేరు తెచ్చుకున్నాడని ఆయన అన్నారు.