Leading News Portal in Telugu

fans exciting about ram charan game changer pre release event in america


  • గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్
  • భారీగా తరలి వచ్చిన జనసందోహం
  • నేడు మరో సింగిల్ రిలీజ్ చేయనున్న మేకర్స్
Game Changer : న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్

Game Changer : రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. రామ్ చరణ్ సోలోగా నటించి నాలుగేళ్లు కావడంతో అభిమానులు తమ హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తు్న్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్లను మూవీ మేకర్స్ ప్రారంభించారని తెలిసింది. సాధారణంగా తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి.

కానీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతోంది. అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తొలి భారతీయ సినిమాగా గేమ్ ఛేంజర్ కొత్త రికార్డు సృష్టించింది. అమెరికన్ తేదీ ప్రకారం, ఈ ఈవెంట్ డిసెంబర్ 21న జరుగుతుంది. అంటే ఈ ఈవెంట్‌ను మరి కాసేపట్లో టెలికాస్ట్ కానుంది. ఈ ఈవెంట్‌ను అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, అతిథి నటుడు సుకుమార్, బుచ్చిబాబు, యాంకర్ సుమ వీరితో పాటు అనేక మంది గేమ్ ఛేంజర్ నటులు ఇప్పటికే అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. వారితో పాటు ఈవెంటు భారీగా జనసందోహం హాజరైంది.

వారికి అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూవీ మేకర్స్ నేడు ఉదయం 8:30 గంటలకు మరో పాటను కూడా విడుదల చేయనున్నారు. అమెరికా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయని తెలిసింది. ప్రమోషన్లతో ఈ సినిమాపై హైప్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.