- ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిజీత్
- మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్
- గాంధీ పాకిస్థాన్ కి పితామహుడని వ్యాఖ్య
బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరి గురించి మాట్లాడారు. దీంతో పాటు మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి జాతిపిత ఆర్డీ బర్మన్ అని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ పాకిస్థాన్ దేశ పితామహుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మహాత్మా గాంధీ జాతి పితామహుడు.. భారతదేశానికి కాదు. పొరపాటున మహాత్మా గాంధీని జాతిపిత అని పిలిచారు.” అని సింగర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
ఎవరు ఈ అభిజీత్ భట్టాచార్య…
అభిజీత్ భట్టాచార్య 1000కి పైగా సినిమాల్లో 6000 కంటే ఎక్కువ పాటలు పాడిన బాలీవుడ్ నేపథ్య గాయకుడు. 2016లో విడుదలైన బాఘీ చిత్రంలోని పాటలను ఆయన పాడారు. ఏక్ చంచల్ శోఖ్ హసీనా, చాందినీ రాత్ హై, హర్ కసమ్ సే బడీ హై వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖిలాడి, షోలా ఔర్ షబ్నం వంటి సినిమాల్లో కూడా అనేక పాటలు హిట్ అయ్యాయి. బాద్‌షా, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, రక్షక్, అంజామ్, డర్, జోష్, ధడ్కన్, రాజ్, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, ఖూబ్‌సూరత్, ఖిలాడి, తుమ్ బిన్, దిల్లాగీ, చల్తే చల్తే, మై హూనా వంటి అనేక సినిమాల్లో పాడిన పాటలు హిందీ ప్రేక్షకుల మదిని దోచేశాయి. ఆయన ప్రధాన భాష హిందీ అయినప్పటికీ… మరాఠీ , నేపాలీ , తమిళం , భోజ్‌పురి , పంజాబీ , ఒడియా, బెంగాలీతో సహా ఇతర భాషలలో కూడా పాడారు. అభిజీత్ 2014 సంవత్సరంలో ఫోర్బ్స్ పాపులర్ 100 ఇండియన్ సెలబ్రిటీకి నామినేట్ అయ్యారు.
READ MORE:Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్!