Leading News Portal in Telugu

Daku Maharaj movie success celebrations will be held in Anantapur


  • బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్
  • ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా వసూళ్లు
  • అతి పెద్ద విజయం దిశగా అడుగులు
Daku Maharaj : ఈ నెల 22న ‘డాకు మహారాజ్’ సక్సెస్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది.

READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌తో 7 ఏళ్ల కొడుకు ఆస్పత్రి వెళ్లడం ఏంటి..? జవాబు లేని 5 ప్రశ్నలు..

ఈ మేరకు తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. జనవరి 22న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాను దైవాన్ని నమ్ముతానని.. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం.. ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్ అని చెప్పారు. వరుసగా ఇది తనకు నాలుగో విజయమన్నారు. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించిందన్నారు. ఆ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తాను.

READ MORE:Aman Jaiswal: విషాదం.. రోడ్డుప్రమాదంలో టీవీ నటుడు అకాల మరణం

చిత్ర బృందానికి తాను కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు ఆయన కీలక విషయం వెల్లడించారు. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయామన్నారు. అందుకే జనవరి 22న అనంతపురంలోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంచి సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు.