Leading News Portal in Telugu

Sankranthiki Vasthunam Collections Crosses 200 Crore Gross in 7 Days and Creates an all time record


Sankranthiki Vasthunam: 200 కోట్లు.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది.. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.. మూవీ యూనిట్ రేపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ఆల్ టైం రికార్డు కూడా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏడు రోజులలో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రీజనల్ తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ అయి 200 కోట్ల కలెక్షన్లు పైగా సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డులకు ఎక్కింది.

Gandhi Tatha Chettu: చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ.. సుకుమార్ కుమార్తెకు అందుకే గుండు: పద్మావతి మల్లాది ఇంటర్వ్యూ

గతంలో ఈ రికార్డు అలవైకుంఠపురంలో సినిమా పేరిట ఉండేది. దాన్ని క్రాస్ చేసి సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. రీజనల్ ఫిలిమ్స్ లో ఫాస్టెస్ట్ 200 కోట్లు గ్రాస్ చేసిన మొట్టమొదటి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలవనుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నరేష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు నటీనటులు నటించారు. యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే , వెంకటేష్ కుమారుడు పాత్రలో నటించిన రేవంత్ వంటి వారి కామెడీ ట్రాక్స్ వర్కౌట్ కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. దీంతో హౌస్ ఫుల్ బోర్డులతో ఈ సినిమా హాల్స్ దర్శనమిస్తున్నాయి.