Leading News Portal in Telugu

Auto Driver Who Took Saif Ali Khan To Hospital Rewarded with 11000 by an organaisation


Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?

జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న పని మనిషితో గొడవకు దిగాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ గలాటా విన్న తర్వాత వచ్చి తన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో నటుడు ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో నటుడిపై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను తీవ్రంగా గాయ పడ్డాడని చెబుతున్నారు. ఈ దాడిలో చిన్నారుల నానీకి కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి పారిపోయిన తర్వాత, సైఫ్ స్వయంగా తైమూర్‌తో కలిసి ఆటోలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లాడు. నటుడి వెన్నెముకకు సమీపంలో కత్తి ముక్క ఇరుక్కుపోయింది, దానిని లీలావతి ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సైఫ్ ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడటం కాస్త ఊరటనిచ్చే విషయమే.

Saif Attack Case: తాను ఎటాక్ చేసింది ‘సైఫ్’ అని నిందితుడికి తెలియదా?

ఇక సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్‌కు ఇప్పుడు రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్రైవర్‌కు రూ.11,000 రివార్డు అందించారు. డ్రైవరు చేసిన సేవకు ఓ సంస్థ రివార్డ్‌ను అందజేసి అభినందించింది. ఇక నిందితుడు పశ్చిమ బెంగాల్‌ వాసి అని చెబుతున్నా, బంగ్లాదేశ్ వాసి అయి ఉండవచ్చని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదు. నిందితుడి నుంచి సరైన భారతీయ పత్రం ఏదీ లభించలేదని డీసీపీ దీక్షిత్ గెడం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై పాస్‌పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.